జర్నలిస్ట్ లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
1 min readడిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్ట్లు
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: జర్నలిస్ట్ లపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వెలుగోడు జర్నలిస్ట్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎపి యూడబ్ల్యు జె జిల్లా నాయకులు , విశాలాంధ్ర విలేకరి ఎస్.రఘు రాముడు , సీనియర్ జర్నలిస్ట్ సుల్తాన్ మోహమ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ లపైన దాడులు పెరిగాయని , జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందని , జర్నలిస్ట్ ల రక్షణ కొరకు కఠిన చట్టాలు తేవాలని అన్నారు. విధి నిర్వహణ లో భాగంగా సమాచార సేకరణ కు వెళ్లిన పాత్రికేయులపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.నడి రోడ్డు పై జర్నలిస్ట్ లపై హత్యాయత్నం చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు.సమాచార సేకరణ కు వెళ్లిన ఏబీఎన్ ప్రతినిధి శశి , హెచ్ఎం టివి ప్రతినిధి రత్నకుమార్ పై భౌతిక దాడి , వాహనాలు , కెమెరాలు ద్యంసం చేయడం క్షమించరాని నేరమని అన్నారు.ఎంపీ గా ఉండి అప్రజాస్వామిక దాడులు చేయించి , పదవికి ఆయన మచ్చ తెచ్చారని తెలిపారు. అలాగే ఆదివారం విశ్వ భారతి ఆసుపత్రి వద్ద జర్నలిస్ట్ లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాo. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళ కు లొంగకుండా జర్నలిస్ట్ లపై దాడులు చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలని జర్నలిస్టు లు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి విలేకరి చాంద్ బాషా , సూర్య విలేకరి చంద్ర శేఖర్ , గిరిజన నాయక్ టైమ్స్ ఎడిటర్ లాలూ నాయక్ , శ్రీ ప్రస్థానం విలేకరి షాభిర్ , మాభూమి విలేకరి ముస్తాక్ అహమ్మద్ , తెలుగు వార్త విలేకరి నాజీర్ ,అంకురం విలేకరి యూనుష్ తదితరులు పాల్గొన్నారు.