వాలంటీర్ మల్లయ్యపై దాడి చేసిన వారిని శిక్షించాలి : జిల్లా కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లోని పడమర ప్రాతకోట గ్రామ వాలంటీర్ కురువ మల్లయ్య ఫై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి, కోశాధికారి కే .సి .నాగన్న , సహాయకార్యదర్శి కే .వెంకటకృష్ణ ,కే .నారాయణ, దివాకర్ డిమాండ్ చేసారు .ఆదివారం నగరం లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కురువ మల్లయ్య ను పరామర్శించారు .ఈ సందర్బంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కురువ మల్లయ్య ఫై ఇనుప రాడ్లతో దాడి చేసిన తిరుమల నాయుడు , కొట్టం శంకర్ ,మహేశ్వర రెడ్డి లను కఠినంగా శిక్షించాలని కోరారు.