మంచి చేసే వారిని ప్రోత్సహించాలి.. కర్నూలు టిడిపి అభ్యర్థి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజంలో మంచి పనులు చేసే వారిని గుర్తించి ఆదరిస్తే వారు మరిన్ని మంచి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. కర్నూల్ నగరంలోని కుమ్మరి వీధిలో ఉన్న శిరిడి సాయిబాబా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 16 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఉట్ల రమేష్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గత 16 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వారిని ప్రతి ఒక్కరు గుర్తించి ఆదరించాలని సూచించారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు టి.జి భరత్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నాగరాజు పాల్గొని టి.జి భరత్ తో కలిసి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు చెన్నా రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బూత్ ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు. మంచి చేసే వారిని ప్రోత్సహించాలి.. కర్నూలు టిడిపి అభ్యర్థి సమాజంలో మంచి పనులు చేసే వారిని గుర్తించి ఆదరిస్తే వారు మరిన్ని మంచి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. కర్నూల్ నగరంలోని కుమ్మరి వీధిలో ఉన్న శిరిడి సాయిబాబా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 16 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఉట్ల రమేష్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గత 16 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వారిని ప్రతి ఒక్కరు గుర్తించి ఆదరించాలని సూచించారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు టి.జి భరత్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నాగరాజు పాల్గొని టి.జి భరత్ తో కలిసి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు చెన్నా రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బూత్ ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.