గెలిచిన వారు రాజులు కాదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని.. వ్యవస్థలన్నీ బలహీన పడుతున్నాయన్నారు. అయితే ఒక వ్యవస్థ నిర్ణయాలపై మరో వ్యవస్థ పరిశీలిస్తుందన్నారు. అమరావతి వంటి కేసులు ఏపీ ప్రభుత్వం చాలా ఓడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతోందని, గెలిచిన వాళ్ళు రాజులు కాదని, ప్రజా సేవకులు అన్న విషయం తెలుసుకోవాలని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.