వెయ్యి మంది మృతి: భారత్ లో విజృంభణ
1 min readఢిల్లీ: కరోన కరాళ నృత్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క రోజులోనే 1000 మంది కరోనాకు బలికావడం.. ప్రమాద ఘంటిక మోగిస్తోంది. 14,11,758 మందికి మంగళవారం పరీక్షలు నిర్వహించగా..1,84,372 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే 1,72,085 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజు రోజుకీ క్రియాశీల కేసులు పెరగడం.. ఆందోళన కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ నియంత్రణలో భాగంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరోవైపు కరోన వ్యాక్సిన పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. నిన్న 6,46,258 మందికి కరోన వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 11,11,79,578 మందికి కరోన వ్యాక్సిన్ వేశారు.