వేల కోట్ల ల్యాండ్ మాఫియా వెలుగులోకి.. !
1 min readపల్లెవెలుగువెబ్ : విశాఖ నగరంలోని దసపల్లా భూములకు రెక్కలొచ్చాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 3 వేల కోట్ల ఆ భూముల్లో వ్యాపార విస్తరణకు భూ రాబందులు సిద్ధమవుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. అది కూడా ప్రభుత్వ అతిధి గృహం దగ్గర సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028లలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించే అవకాశం లేకుండా 22ఏ లోనే ప్రభుత్వ భూమిగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో.. జనసేన నేతలు.. జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున కు ఫిర్యాదు చేశారు.