శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాదిగా పోటెత్తిన భక్తులు
1 min readస్వామివారికి ప్రభాతసేవ నిత్యార్చన పూజలు
వివిధ సేవలరూపేణ రూ: 95,683/-లు ఆదాయం
వేసవి దృశ్య భక్తులకు మజ్జిగ చలివేంద్రం
నిత్య అన్నదాన సత్రంలో వెయ్యి మంది భక్తులకు అన్నప్రసాద వితరణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము ఉగాది మరియు మంగళవారం సందర్భముగా వేలాది మంది భక్తులు బారులుతీరి దర్శించుకున్నారు. తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ దక్షిణ ప్రాకారమండప నిర్మాణ దాతలు పూజ్క్య గురువులు శ్రీ బందకవి రామ జోగేశ్వరావు శిష్యబృందం ప్రతి సంవత్సరం వలె ఏప్రిల్ 16 న నిర్వహించు విదముగా ఈరోజు శ్రీసువర్చలా హనుమద్ కళ్యాణం జరిపించారు. ప్రత్యేక పూలతో అలంకరించిన మండపం పై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి, శాస్త్రోక్తంగా అర్చక స్వాములు కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఈకార్యక్రమములో 50 మంది దంపతులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఈరోజు భక్తుల సౌకర్యార్ధం ఆలయమువద్ద ప్రారంభించిన మజ్జిగ చలివేంద్రంవద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.95,683 /- లు సమకూరినది. సుమారు 1000 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.