శ్రీ రామాలయం దివ్యమంగళ రథోత్సవానికి వేలాది గా తరలిరావాలి..
1 min read
సమితి అధ్యక్షులు చిల్కూరు ప్రభాకర్.
కర్నూలు, న్యూస్ నేడు: “కర్నూలు నగరంలో ప్రముఖమైన అతి ప్రాచీనమైన దేవాలయం పేట శ్రీ రామాలయం. ఇది సుమారు 200 సంవత్సరాల కు పూర్వమే ఉన్నదని” ప్రధాన అర్చకులు శ్రీ మాళిగి హనుమేశాచార్యులు తెలిపారు.10-05 -2025 వతేది గురువారం ఉ. 11: 00 లకు మెయిన్ బజార్, పేట శ్రీ రామాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేవాలయములో 1925 వ సంవత్సరము నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయని అనేకమంది దాతల ద్వారా నిర్వహించబడే ఈ బ్రహ్మోత్సవాలు 100 సం.లు జరుగుతున్న సందర్భంగా శతాబ్ది బ్రహ్మోత్సవాలు 2025 వ సం.లో చైత్రమాసంలో అనగా ఏప్రిల్ 12/04/2025 చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి 18/04/2025 బహుళ పంచమి వరకు12 వ తేదీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ పవమాన హోమము – హానుమద్వాహనము, 13 శ్రీ ధన్వంతరీ హోమము – గజవాహనము 14 వ తేది శ్రీ నరసింహ హోమము – శేష వాహనము,15 వ తేది శ్రీ సుదర్శన హోమము – గరుడవాహనము, 16 శ్రీ సీతారాముల కళ్యాణం మరియు సా. రథోత్సవము, 17 వ తేది శ్రీ గోపాలకృష్ణ హోమము – అశ్వవాహనము, 18 వ తేది శ్రీ మహాలక్ష్మీ హోమము – హంసవాహనము నిర్వహిస్తున్నామని ఈ శతాబ్ది బ్రహ్మోత్సవాల తో పాటు ఆలయ జీర్ణోద్ధరణ, నిర్వహణ వంటి విషయాల కోసం దాతలను ప్రత్యేకంగా అర్థిస్తున్నామనికోరారు. సమితి అధ్యక్షులు చిల్కూరు ప్రభాకర్ మాట్లాడుతూ . .కర్నూలు నగరం నుండి కోడుమూరుకు వెళ్లే దారిలో పాలకుర్తికి ఒక మైలు దూరంలో లక్ష్మీ రామచంద్రపురం అనే గ్రామం 7-3 -1908 వ తేదీన ప్లవంగ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి శనివారం గ్రామ ప్రతిష్ట జరిగిందని, నాటి జిల్లా కలెక్టర్ శ్రీ రామచంద్ర రావు గారు ఆ గ్రామములో ఉన్న 8 వందల ఎకరముల భూమిలో కర్నూలు పేటలోని శ్రీ రామువారి దేవాలయానికి రథోత్సవం మొదలైన కైంకర్యముల నిర్వహణకు 150 ఎకరముల భూమిని పట్టా చేయించారు. ఆ భూమితో పాటు పండ్ల బజార్ లోని కొన్ని దుకాణాలు, మించిన్ బజార్ స్థలంలో నున్న రథశాల స్థలాన్ని కూడా రామాలయానికి ఏర్పాటు చేశారని తెలియజేశారు శ్రీ ఇంద్రగంటి శేషావధానులుజీవిత చరిత్ర అనే గ్రంథంలో కర్నూలు రామాలయానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ ఆలయపు శతాబ్ది బ్రహ్మోత్సవాలను ప్రచారం చేయటానికి ప్రతి నెల శుక్లనవమినాడు ఊంజల సేవ ,శ్రీ సీతారాముల వారి కళ్యాణం వంటి కార్యక్రమాల ద్వారా ప్రచారం చేశామని తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దినేష్ చౌదరి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వైపు 7 రోజుల బ్రహ్మోత్సవాలకు ,వాహన సేవలకు, ప్రతి రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రత్యేక హోమములు, నుండి కళ్యాణోత్సవం రోజున అన్న ప్రసాద వితరణ, తదితరములు జరుగుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిల్కూరు నందకిషోర్, ఎస్ ప్రాణేష్,మాళిగి వ్యాస రాజ్, నాగోజి, విఠల్ రావు,మాళిగి భానుప్రకాష్, చంద్రకాంత్, నరహరి, నీలి నరసింహ,కమలాపురం సునీల్, సాయినాథ్ శర్మ,సతీష్,రంగస్వామి,మాధవస్వామి ,తదితరులు పాల్గొన్నారు.