PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబానీకి బెదిరింపు కాల్స్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఓ వ్యక్తి ముంబైలోని గిర్గావ్‌ ప్రాంతంలో ఉన్న రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లోని పబ్లిక్‌ ఫోన్‌కు కాల్‌ చేసి ముకేశ్‌ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మూడు, నాలుగుసార్లు వచ్చిన ఈ ఫోన్‌ కాల్‌పై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై నగర పోలీసులు దహిసార్‌ ప్రాంతంలో ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

                                     

About Author