సీఎంకు బెదిరింపులు !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ సీఎం భగ్వంత్ సింగ్ మాన్కు సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి తీవ్ర బెదిరింపులు ఎదురయ్యాయి. ‘‘స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించాలి. ఖలిస్థానీ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా నడుచుకోవడం ఆపేయాలి. లేకపోతే మాజీ సీఎం బియాంత్ సింగ్కు పట్టిన గతే మీకూ పడుతుంది. మా హెచ్చరికలను బేఖాత రు చేస్తే జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని ఎస్ఎ్ఫజే చీఫ్ గుర్పత్వంత్ పన్నూ ఒక వీడియోలో బెదిరించారు. అలాగే ఖలిస్థానీ రెఫరెండంపై ఓటింగ్ తేదీని సోమవారం అకల్ తఖ్త్ వద్ద ప్రకటిస్తామని ఆయన తెలిపారు.