PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈతకు వెళ్లి..ముగ్గురు చిన్నారులు మృతి

1 min read

– అల్లూరు గ్రామంలో విషాధం..
– బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్థర్​
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో కుంటలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన అల్లూరు గ్రామం దళిత కుటుంబానికి చెందిన పక్కిరయ్య ,రాజేశ్వరి కుమారుడు విశాల్ ( 3వ తరగతి), అలాగే సంజీవరాయుడు ,మహేశ్వరి కుమారుడు శరత్ (4వ తరగతి), మరియు మధు ,మరియమ్మ ల కుమారుడు మహేష్ (5వ తరగతి) చదువుతున్నారు. ముగ్గురు చిన్నారులు బుధవారం సాయంత్రం 4 గంటలకు గ్రామ సమీపంలోని నీటికుంటలో ఈత కోసం వెళ్లారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లి ఇంటికి వచ్చారు. రాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని వాకబు చేశారు. గ్రామ చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ శివారులో కేసి కాలువ , పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.


60 అడుగుల లోతులో… మృతదేహాలు..
పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు నీటి కుంట వద్ద పిల్లల దుస్తులు ఉండడంతో కుంటలో రాత్రివేళ గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం శాతనకోట గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లు లాల్, మహేష్ను పోలీసులు పిలిపించి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 60 అడుగులలోతు ఉన్నా నీటి కుంటలో పిల్లల మృతదేహలు బయట పడ్డాయి. పిల్లల మరణ వార్త తెలుకున్న గ్రామస్తులు, సమీపంలోని గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ ప్రాంతంలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశాని అంటాయి. పలువురిని కంట తడి పెట్టించాయి. బ్రాహ్మణ కొట్కూర్ ఎస్ ఐ ఓబులేష్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే పరామర్శ..
అల్లూరు గ్రామంలో చిన్నారుల మత్యువార్త తెలుసుకున్న నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.

About Author