NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగ్గురు పంచాయ‌తీ రాజ్ అధికారులు స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ముఖ్యమంత్రి ప్రారంభించిన నాడు-నేడు ప‌నుల్లో నాణ్యత లోపం స్పష్టంగా క‌నిపించింది. రాజ‌మండ్రిలోని పి.గ‌న్నవ‌రం హైస్కూల్ లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప‌నుల్లో నాణ్యత లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఈ విష‌యం పై విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ రాజ‌శేఖ‌ర్ సీరియ‌స్ అయ్యారు. ప‌నుల్లో నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించిన పంచాయ‌తీ రాజ్ అధికారుల‌ను సస్పెండ్ చేశారు. పంచాయ‌తీ రాజ్ జేఈ ఆనంద్, డీఈఈ చంద్రశేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. చంటిబాబు పై స‌స్పెన్షన్ వేటు ప‌డింది. ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలోనే నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించ‌డం ప‌ట్ల ఉన్నతాధికారులు సీరియ‌స్ అయ్యారు.

About Author