ఐఏఎస్ కు మూడేళ్ల జైలు శిక్ష !
1 min readపల్లెవెలుగువెబ్ : యూపీఏ-1 హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో అప్పటి కేంద్ర బొగ్గుగనుల శాఖ కార్యదర్శి హెచ్.సి.గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. లోహరా ఈస్ట్ కోల్ బ్లాక్‌ను గ్రేస్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(జీఐఎల్)కు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వాన్ని ఆయన మోసగించారని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అందజేసిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలతో ఏకీభవించిన సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అరుణ్ భరద్వాజ్.. సోమవారం గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించారు. ఆయనతోపాటు.. అప్పట్లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన కేఎస్ క్రొఫాకు రెండేళ్లు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా..మరో నిందితుడు ముఖేశ్ గుప్తాకు నాలుగేళ్ల ఖైదు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.