మూన్నాళ్ల ముచ్చటే నిఘా నేత్రాలు
1 min read– కెమెరాలు లేకపోతే అల్లరి మూకల నుంచి కష్టమేనంటున్న మండల ప్రజలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలోని నందికొట్కూరు నంద్యాల ప్రధాన రహదారిలో ఉన్న బ్రహ్మంగారిమఠం దేవాలయం మలుపు దగ్గర గతంలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు(సీసీ కెమెరాలు) మూన్నాళ్ళ ముచ్చటగానే మారాయి.గత సంవత్సరంలో బ్రహ్మంగారి మఠం దేవాలయం దగ్గర ఉన్న విద్యుత్ స్తంభానికి అక్రమ రవాణా,వ్యక్తుల కిడ్నాప్,తదితర వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో గత సంవత్సరం మొదట్లో (సీసీ కెమెరాలు)నిఘా నేత్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు.అవి కొద్ది నెలలు మాత్రమే పనిచేశాయి.తర్వాత దాదాపుగా గత 7 నెలల నుంచి పూర్తిగా సీసీ కెమెరాలు పనిచేయడమే లేదని కరెంటు స్తంభానికి రేకులు మాత్రమే దర్శనమిస్తున్నాయని మండల వాసులు చర్చించుకుంటున్నారు.అంతేకాదు మిడుతూరు పోలీస్ స్టేషన్ మెయిన్ గేటుకు ఉన్న సీసీ కెమెరా అది కూడా పని చేయడం లేదని అక్కడ ఉన్న సీసీ కెమెరాను తీసివేశారు.అంతేకాదు మండల కేంద్రంలో ప్రధానంగా ఆటో స్టాండ్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల మహిళలు,బాలికలకు అల్లరి నూకల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందోనన్న భయం వారిలో ఉంటుందని మండల కేంద్రంలో సంబంధిత అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.తర్వాత రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే..?