PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

1 min read

– వీరంతా ఓకే కుటుంబానికి చెందిన దయాదులు
– లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం, ఓవర్టేక్ తోనే ప్రమాదం
– గ్రామంలో బంధువులు, స్నేహితులతో మిన్నంటిన రోదనలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వారంతా దాయాదుల పిల్లలు , ముగ్గురు యువకులు స్నేహితులు, చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు, ఈ క్రమంలో వారు నిన్నటి దినం శనివారం సాయంత్రం ఒంటిమిట్ట, బెస్తపల్లి, కుడుమలూరు గ్రామాలలో చేపల వ్యాపారం చేసుకుని తిరిగి ఆదివారం స్వగ్రామమైన బెస్తకాలనికి పది నిమిషాలలో చేరతారు అనగా విధి లారీ రూపంలో వారిని కబళించి వేసి ఆ కుటుంబాలలో తీరని వ్యధను మిగిల్చింది.. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నూరు టౌన్ బెస్త కాలనీకి చెందిన రమణయ్య, నాగమ్మ ల కుమారుడు వర్తిబోయిన దినేష్ వయస్సు (26) సంవత్సరాలు, అలాగే వెంకటేష్, వెంకటసుబ్బమ్మ ల కుమారుడు వద్ది బోయిన వెంకట సురేష్ వయసు (22) సంవత్సరాలు, అదేవిధంగా వెంకటరమణ, రమాదేవిల కుమారుడు వర్ధిబోయిన వెంకటేష్ వయసు(19) సంవత్సరాలు వీరు ముగ్గురు యువకులు ఇద్దరు డిగ్రీ వరకు మరొకరు ఇంటర్ వరకు చదువుకొని జీవనాధారం కొరకు చేపల వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు, ఈ తరుణంలో వారు ఒంటిమిట్ట, బెస్తపల్లి, కుడుమూరు గ్రామాలలో చేపల వ్యాపారం నిమిత్తం వెళ్లి తిరిగి చెన్నూరు బెస్త కాలనీకి వస్తుండగా చెన్నై కి వెళుతున్న లారీ కడప- రాజంపేట బైపాస్ పాలంపల్లి వద్ద లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం తో పాటు ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు, అయితే పది నిమిషాలలో ఇంటికి చేరుతారు అనగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, ఈ ఘటనతో చెన్నూరు బెస్త కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి, యువకుల తల్లిదండ్రుల, బంధువుల స్నేహితులు , గ్రామస్తులు కన్నీటి పర్యంత మయ్యారు, చేపల వ్యాపారం చేసి వారి కుటుంబాలకు అండదండగా ఉండే వారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబాన్ని పోషించే దిక్కు కోల్పోవడం జరిగిందని వారు వాపోయారు…. కడప రిమ్స్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించిన కడప డిఎస్పి వెంకట శివారెడ్డి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు పులి సునీల్ కుమార్, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి.. కడప- రాజంపేట బైపాస్ పాలెం పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వర్ధిబోయిన దినేష్, వర్ధిపోయిన వెంకటేష్, వర్ధిబోయిన వెంకట సురేష్ మృతదేహాలను పరిశీలించారు, అనంతరం ప్రమాద విషయాలను ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి ని ఆయన అడిగి తెలుసుకున్నారు, కాగా పులి సునీల్ కుమార్, గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పుత్త నరసింహారెడ్డి , యువ నాయకులు పుత్తా చైతన్య రెడ్డి, పుత్తా లక్ష్మిరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు, అలాగే మృతి చెందిన యువకుల పోస్టుమార్టం చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author