తుంగభద్ర నది లో ముగ్గురు యువకులు గల్లంతు
1 min read
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
న్యూస్ నేడు మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్నాటక నుండి వచ్చిన యువకులు పవిత్ర తుంగభద్ర నది లో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్లి గల్లంతు అయున సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, తోటి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం కర్నాటక లో హాసన్ జిల్లా జాగాలి గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులు రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు శనివారం రాత్రి వచ్చారు. ఉదయం దర్శించుకున్నారు. అయితే సాయంత్రం స్నానాలు చేసేందుకు తుంగభద్ర నది లో దిగారు. ఇందులో సచీన్ (19),ప్రమోద్ (19),అజిత్( 20)లు స్నానాలు చేస్తు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. రంగనాథ్ అనే యువకుడుని భక్తుడు ఒడ్డున కు తీసుకుని వచ్చారు. మిగతా ముగ్గురు ఒడ్డుకు ఉండడం తో ప్రాణాలు మిగిలాయి. విషయం తెలుసుకున్న ఎస్సై శివాంజులు, గోనేగండ్ల సిఐ గంగాధర్, నందవరం ఎస్సై కేశవ, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య లు గజ ఈతగాలతో పుట్టిలతో గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి వర్షం రావడం తో గాలింపు చర్యలకు కొద్దిగా ఆటంకం ఏర్పడింది. వర్షం నిలిచిన తరువాత గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకు గల్లంతు అయిన యువకుల ఆచూకీ లబించలేదని ఎస్సై శివాంజులు తెలిపారు. సమాచారం తల్లిదండ్రుల కు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మంత్రాలయం తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు….గల్లంతైన వారు కర్ణాటక రాష్ట్రం హాసన్ కి చెందిన అజిత(19), సచిన్(19), ప్రమోద్(19) లు గా గుర్తింపు….స్నేహితులతో కలసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనంకు వచ్చిన ఏడుగురు స్నేహితులు .మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.