NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీ ఎటిఎం చోరికి  ప్రయత్నించిన దుండగలు..

1 min read

ఉలిందకొండ పోలీసులు, గ్రామ యువకుల అప్రమత్తత తో ఎటిఎం చోరి విఫలయత్నం.

ఎటిఎం చోరి ప్రయత్నాన్ని  భగ్నం  చేసిన  పోలీసులను, యువకులను అభినందించిన …

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

పోలీసులకు సహాకరించిన యువకులకు రివార్డులు అందజేసిన … కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్.

పల్లెవెలుగు , కర్నూలు:  కల్లూరుమండలం చిన్న టేకూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున  గుర్తు తెలియని దుండగలు టోయింగ్ వాహనంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటిఎం మిషన్ చోరి చేయుటకు ప్రయత్నించారు. ఎటిఎం షట్టర్ ను లాగి , లోపలున్న ఎటిఎం మిషన్ ను తాళ్ళతో లాగుకొని పోయే ప్రయత్నం జరుగుతుండగా,  అక్కడే  ఉన్న చిన్న టేకూరు గ్రామ యువకులు దొంగల చర్యలు గమనించి ఉలిందకొండ ఎస్సై ధనుంజయ్ కు  ఫోన్ లో సమాచారం అందించారు. ఉలిందకొండ ఎస్సై ధనుంజయ్,  ఓర్వకల్లు ఎస్సై సునీల్   , పోలీసులు , గ్రామ యువకులు దొంగల వెంటబడ్డారు. దీనితో దుండగలు ఎటిఎం మిషన్ ను తరలించుకుని పోయే ప్రయత్నం విరమించి టోయింగ్ వాహనం  హైవే మీద వదిలేసి పారి పోయారు.  ఈ విషయం తెలుసుకున్న  కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్,  కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే  ఉలిందకొండ గ్రామంలో ఎటిఎం చోరియత్నం గురించి విచారణచేసి పోలీసులకు సహాకరించిన యువకులు 1. ఎం మహేష్ 2. షేక్.  ఇలియాస్ 3.దిలావర్ షేక్ అబ్దుల రెహ్మాన్ 4 .మొల్లా హనేఫ్ బాషా  లను కర్నూలు డి.ఎస్.పి కార్యాలయంలో కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ గారు అభినందించారు. రివార్డులు అందజేశారు.

About Author