PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయుల‌కు పిడుగులాంటి వార్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉపాధ్యాయులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెబుతోంది. స్కూల్ ఉదయం 9 గంటలు అయితే ఓ పది నిమిషాలు అటూ ఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇక నుంచి ఆ పప్పులు ఉడకవ్. ఖచ్చితంగా ఉదయం 9గంటలకు పాఠశాల ప్రాంగణంలో ఉండాల్సిందే. లేదంటే ఆ రోజుకు ఇక సెలవే.. దీని కోసం టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ఏపీ విద్యాశాఖ అమల్లోకి తేనుంది. ‘సిమ్స్ – ఏపీ’ అనే మొబైల్ యాప్ ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే అందరూ ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ ద్వారా ఉదయం 9గంటల‌లోపు స్కూల్‌కు వచ్చి ఫోటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోనే కదా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు.. ఆ ఫోటోను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా పాఠశాలకు వచ్చిన తరువాతనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 9గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ యాప్ ఫోటోను తీసుకోదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. లీవ్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ఎందుకంటే జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను ఆ యాప్ గుర్తిస్తుంది. ఫోటో ఎక్కడ నుంచి తీసుకున్నారో ఇట్టే చెప్పేస్తుంది. దీంతో ఎలాగైనా 9గంటల లోపు పాఠశాలకు వచ్చి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది.

                                                  

About Author