ఇంటి పై పిడుగు.. 20 లక్షలు దగ్ధం !
1 min read
Bright lightning illuminates dark cloudy sky during a thunderstorm. Natural dangers and majestic beauty. Real cloudscape with computer generated lightning. Copy space on image side.
పల్లెవెలుగు వెబ్: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెం గ్రామంలో ఓ ఇంటి పై శనివారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనలో కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంట్లోని 20 లక్షల నగదు దగ్ధమైంది. కుమారుడి చదువు కోసం పొలం విక్రయించగా 20 లక్షలు వచ్చాయని, పిడుగు పడి మొత్తం డబ్బు మంటల్లో బూడిదై పోయిందని బాధితులు విలపించారు. నగదుతో పాటు 50 కాసుల బంగారం కూడ మంటల్లో దగ్దమైందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.