PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలాంటి వారికే టికెట్లు.. నంద్యాల నేత‌లతో చంద్ర‌బాబు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారంద‌రికీ అవే స్థానాల్లో సీట్ల‌ను కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. తాజాగా శుక్ర‌వారం మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన పార్టీ ఇంచార్జీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటికి నంద్యాల జిల్లాలోని పాణ్యం, బ‌న‌గాన‌ప‌ల్లె ఇంచార్జీలు గౌరు చ‌రితారెడ్డి, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు ఏలూరు ఇంచార్జీ బ‌డేటి రాధాకృష్ణ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిపై చంద్ర‌బాబు ఆరా తీశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌య‌తీరాల‌కు చేరాలంటే ఏ ఒక్క నియోజకవ‌ర్గాన్ని కూడా నిర్ల‌క్ష్యం చేయ‌రాద‌ని ఆయ‌న తెలిపారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా ప‌నితీరు ఆధారంగానే నేత‌ల‌కు టికెట్లు కేటాయిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువై… పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

                                     

About Author