PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించాలి

1 min read

– ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించని పక్షంలో ఈ నెల 17వ తేదీన 12 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి హెచ్చరించారు. ఏలూరు పోనంగి రోడ్డులో నిర్మించిన ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన టిడ్కో గృహాలు పర్యవేక్షణ లేక పాడైపోవడాన్ని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాలను కక్ష సాధింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేయటం దారుణమని ధ్వజమెత్తారు. దాదాపు 6500 ఇళ్లు నిర్మిస్తే నాలుగేళ్ల పాటు వాటి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన వైసిపి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం 2,200 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామని, మిగిలిన వారికి జగనన్న ఇళ్ళ కాలనీలలో ఇస్తామని ప్రభుత్వం ప్రగల్పాలు పలికిందన్నారు. పేదలకు మేలు జరుగుతుందన్న ఆశతో టిడిపి తో పాటు ఇతర ప్రతిపక్షాల నాయకులు కూడా నమ్మడం జరిగిందన్నారు. అయితే రోజులు గడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి తన మారీచ జిత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపును చేయలేకపోయారని బడేటి చంటి మండిపడ్డారు. ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించని పక్షంలో 17వ తేదీన 12 గంటల దీక్షకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. లబ్ధిదారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన కోరారు . ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని, ప్రజా సంక్షేమాన్ని మరిచి తుగ్లక్ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల త్వరలోనే బుద్ధి చెబుతారని బడేటి చంటి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ ఇంచార్జ్ లు టౌన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. హెచ్చరించారు. ఏలూరు పోనంగి రోడ్డులో నిర్మించిన ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన టిడ్కో గృహాలు పర్యవేక్షణ లేక పాడైపోవడాన్ని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాలను కక్ష సాధింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేయటం దారుణమని ధ్వజమెత్తారు. దాదాపు 6500 ఇళ్లు నిర్మిస్తే నాలుగేళ్ల పాటు వాటి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన వైసిపి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా మాయమాటలతో మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం 2,200 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామని, మిగిలిన వారికి జగనన్న ఇళ్ళ కాలనీలలో ఇస్తామని ప్రభుత్వం ప్రగల్పాలు పలికిందన్నారు. పేదలకు మేలు జరుగుతుందన్న ఆశతో టిడిపి తో పాటు ఇతర ప్రతిపక్షాల నాయకులు కూడా నమ్మడం జరిగిందన్నారు. అయితే రోజులు గడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి తన మారీచ జిత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపును చేయలేకపోయారని బడేటి చంటి మండిపడ్డారు. ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించని పక్షంలో 17వ తేదీన 12 గంటల దీక్షకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. లబ్ధిదారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన కోరారు . ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని, ప్రజా సంక్షేమాన్ని మరిచి తుగ్లక్ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల త్వరలోనే బుద్ధి చెబుతారని బడేటి చంటి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ లు, డివిజన్ ఇంచార్జ్ లు టౌన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author