టిడ్కో ఇళ్లు…పేదలగూటిపై టిడిపి చిత్తశుద్ధికి ఆనవాళ్లు!
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇవి ఆళ్లగడ్డలో పేదలకోసం మేం నిర్మించిన టిడ్కో ఇళ్లు. పేదలగూడుపై తెలుగుదేశం చిత్తశుద్ధికి ఆనవాళ్లు. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామన్న జగన్ నాలుగేళ్లలో కట్టింది 5ఇళ్లు కాగా, ఒక్క ఆళగడ్డలోనే 3వేలు, రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో 3.13లక్షల టిడ్కో ఇళ్లు కట్టిన ఘనత చంద్రబాబుది. ఎవడికో పుట్టిన బిడ్డలను తమబిడ్డలని చెప్పుకోవడం అలవాటుపడిన వైసిపినేతలు మేం కట్టిన ఇళ్లకు సిగ్గులేకుండా రంగులు మాత్రం వేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటివి పట్టుమని పదిళ్లు కట్టామని చూపించే దమ్ముందా జగన్ రెడ్డీ?!