టిడ్కో గృహాల రుణాలను వేగవంతం చేయాలి : కలెక్టర్ కోటేశ్వరరావు
1 min readజూమ్ వీసీలో బ్యాంక్ మేనేజర్లను ఆదేశించిన కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలో టిడ్కో గృహాలకు మంజూరు చేసే రుణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుంచి టిడ్కో గృహాలకు మంజూరు చేసే రుణాల పై మున్సిపల్ కమిషనర్ లు, బ్యాంక్ మేనేజర్ లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ….టిడ్కో గృహాల రుణాలకు సంబంధించి ప్రభుత్వ బ్యాంక్ లు 11, 13 ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,693 గృహాలకు రుణాల మంజూరుపై టార్గెట్ ఇచ్చామని, ఇందులో 4301 అకౌంట్లు ఓపెన్ చేశారని, మిగిలిన అకౌంట్లో అని కూడా ఓపెన్ చేసేందుకు లబ్ధిదారులను వార్డు సచివాలయం వారిగా మోటివేషన్ చేసి బ్యాంకుకు తీసుకెళ్లి బ్యాంక్ ఖాతా వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మెప్మా, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వీటిలో 1447 మందికి రుణాలు మంజూరు చేశారని, మిగిలిన దరఖాస్తులుకు పరిశీలించి లబ్ధిదారులకు సత్వరమే రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, టిడ్కో గృహాల లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి ఆలస్యం లేకుండా రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా అవసరమైన డాక్యుమెంట్లు సేకరించుకొని వచ్చిన వెంటనే రుణాలు మంజూరు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలని బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అందులో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులతో టీడ్కో రుణాల మంజూరు పై జిల్లా కలెక్టర్ బ్యాంక్ ల వారిగా సమీక్షించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో కర్నూలు నగరపాలక సంస్థ కమీషనర్ డి.కె.బాలాజీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధిక, ఎల్‌డీఎం వెంకట నారాయణ, మున్సిపల్ కమిషనర్ లు, బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.