పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
1 min read
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి
సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి,సెల్ ఫోన్ లకు అనుమతి లేదు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఈనెల 17 నుంచి పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కలెక్టర్ ఆల్ ద బెస్ట్ (శుభాకాంక్షలు) తెలుపుతూ,సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలుఅనుమతించబడవన్నారు.. పాఠశాల యూనిఫారం ధరించి పరీక్షకు హాజరు కాకూడదన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 17 నుండి 31 వరకు 10 వ తరగతి రెగ్యులర్ వారికీ, 17 నుండి మార్చ్ 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు 10 వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 133 కేంద్రాల్లో 25,179 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్స్ నుండి 793, మంది విద్యార్ధులకు గానూ 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా చూడాలని సంబంధితఅధికారులు, ఇన్విజిలేటర్లకు ఇప్పటికే స్పష్టం చేశామాన్నరు.పరీక్షలు నిర్వహించే సమయంలో అన్నిపరీక్షా కేంద్రాల పరిధిలో 163-బి సిఆర్ పిసి సెక్షన్ అమల్లో ఉంటుందన్న. పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించడం జరిగింది అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించారన్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి వివిధ స్థాయిల్లో అధికారులను నియమించామన్నారు.అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు,డిపార్ట్మెంటల్ అధికారులను నియమించమన్నారు.మరో ఐదుగురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 62 మంది కస్టోడియన్లను నియమించమన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు 1,120 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు.