PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా పర్యటనకు పటిష్ట  భద్రత ఏర్పాట్లు

1 min read

ఇప్పటికే  శ్రీశైలం అడవులన్నింటిని జల్లెడ పట్టిన  గ్రేహౌండ్స్ మరియు స్పెషల్ పార్టీ బలగాలు…

 భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS  

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు  09-11-2024 తేదీన నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందినంద్యాల జిల్లా ఎస్పీ  ముఖ్యమంత్రి  పర్యటించే ప్రదేశాలను స్వయంగా పర్యటించి తీసుకోవలసిన భద్రత చర్యల గురించి సంబంధిత అధికారులకు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి  శ్రీశైలం చేరుకున్నప్పటి నుండి అనగా శ్రీశైలం నందు సీ ప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం (పాతాళగంగ బోటింగ్ ప్రదేశం) నుండి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శించుకుని తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 523 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో  మరియు 10 స్పెషల్ పార్టీ బృందాలు 04 గ్రేహౌండ్స్ బృందాలతో   కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.ముఖ్యమంత్రి  పర్యటించే ప్రదేశాలను వివిద సెక్టర్లుగా విభజించి ప్రతి సెక్టార్ కు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ఆపై డి.ఎస్.పి స్థాయి అధికారులు నియమించడం జరిగింది.CM  పర్యటించే ప్రాంతాలలో 34 మంది B.D టీం ల సహాయంతో DFMD లు,HFMD లు మరియు ఇతర పూర్తి పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. పాతాళగంగ, శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో 04 గ్రేహౌండ్స్ మరియు 10 స్పెషల్ పార్టీ బలగాలతో శ్రీశైలం అడవులన్నింటిని జల్లెడ పట్టడం జరిగింది.

About Author