శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు…
1 min read
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించండి….
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని దిశా నిర్దేశం….
జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపిఎస్
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ డిజీపి హరీష్ కుమార్ గుప్త ఐపిఎస్, Addl. DGP L& O శ్రీ మధుసూదన్ రెడ్డి ఐపిఎస్ , కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపిఎస్ ఆదేశాలు మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపిఎస్ రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈసారి శ్రీశైలం మహా పుణ్య క్షేత్రం ఉగాది బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఉగాది బ్రహ్మోత్సవాలకు నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు నుండి 6 మంది డిస్పీపి లు, 40 మంది సీఐలు లు, 100 మంది ఎస్ఐ లు, సుమారు 1500 మంది సివిల్ పోలీసులు, 200 మందిన Armed పోలీసులు, 200 మంది APSP పోలీసులు మరియు 100 మంది Special Party పోలీసు లను బందోబస్తు విధులలో ఉపయోగిస్తున్నారు. అంతేకాక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం సుమారు 800 సీసీ కెమెరాలు మరియు 3 Drones తో శ్రీశైల పరిసర ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.దొంగతనాలు జరగకుండా ఉండేందుకు క్రైమ్ పోలీసు లను ఏర్పాటు చేయడం జరిగింది.గుడిలోకి ప్రవేశించు మార్గాలలో Bomb disposal teams, Q లైన్స్ వద్ద భక్తులను తనికి చేసేందుకు DFMD, HHMD లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో నంద్యాల AR Addl ఎస్పీ చంద్రబాబు, ఆత్మకూర్ డిఎస్పీ రామంజి నాయక్, శ్రీశైలం వన్ టౌన్ సీఐ జీ. ప్రసాదరావు పాల్గొన్నారు.

