తుఫాన్ ముగిసే వరకు.. సచివాలయంలోనే ఉండాలి
1 min readకార్యదర్శులను ఆదేశించిన వీరబల్లి ఎంపీడీవో మల్లీశ్వరి
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా తీసుకోవలసిన చర్యల పైగ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎం పీ డీ ఓ మల్లీశ్వరి తగు సూచన లు సలహాలు ఇచ్చారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ ఎంపీడీవో కార్యాలయంలో, గ్రామ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మండలం ప్రజల కు తెలపాలన్నారు. కంట్రోల్ రూముల కు ఆపరేటర్ గా సురేంద్ర సెల్ నెంబర్ : 8008989060, 8184815080 ను నియమించారు. మండల పరిధిలో ఏదైనా పంచాయతీ లో తుఫాన్ వల్ల విపత్తు సంభవిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు. .అదేవిధంగా తుఫాను ప్రభావం వలన రోడ్లపై నిల్వ ఉన్న నీటిపై ఆయిల్ వేసి లార్వాను తొలగించాలని తెలిపారు. జి ఎల్ ఎస్ ఆర్, జి హెచ్ ఎస్ ఆర్ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్లతో క్లోరినేషన్ చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల లో ముందుగా బ్లీచింగ్, సున్నం స్టాకును రెడీగా ఉంచుకోవాలన్నారు తుఫాన్ అనంతరం గ్రామపంచాయతీలు నందు వీధులలో దోమలు రాకుండా వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో తుఫాను ప్రభావం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక ట్రాక్టర్ , ఐదు మంది రెవిన్యూ సిబ్బంది రెడీగా ఉండాలన్నారు. మండలంలో అన్ని గ్రామపంచాయతీలలో తుఫాను ప్రభావం వల్ల ఎక్కడైనా కరెంటు స్తంభాలు పడిపోయిన వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలపాలన్నారు. మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు ఈ తుఫాన్ హెచ్చరికలను టామ్ టామ్ చేయాలని తెలిపారు. ఈ తుఫాను ప్రభావం తగ్గేవరకు ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి ఆయా పంచాయతీ హెడ్ క్వాటర్ లో ఉండి పర్యవేక్షించాలన్నారు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు గ్రామ సచివాలయం సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు. మండల హెడ్ క్వాటర్స్ , గ్రామపంచాయతీలలో తుఫాను ప్రభావం వలన ప్రజలకు ఎటువంటి అనారోగ్యం వాటిల్లినా వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ఎంపీడీవో సెల్ నెంబర్ 7702070587 ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈపిఓఆర్డి రామచంద్రారెడ్డి అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శిలు పాల్గొన్నారు.