PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాలం విలువైనది.. ప్రాణం బహు విలువైనది : ఎంవి ఐ దినేష్ చంద్ర

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లారాయచోటి: కాలం కంటే ప్రాణం చాలా విలువైనదని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర పేర్కొన్నారు.. జిల్లా రవాణా అధికారి( డి టి ఓ) శాంత కుమారి ఆదేశాల మేరకు రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్నం రోడ్డు భద్రత నియమాలపై రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ గుర్తులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపితే జరిమానా విధిస్తారన్నారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 129 ప్రకారం ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. లేకుంటే 2000/- రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. హెల్మెట్ ప్రాణాలకు రక్షణగా ఉంటుందన్నారు. శ్రుతిమించిన వేగం వల్ల వాహన చోదకుడితో పాటు ఎందరో అభాగ్యులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ సిగ్నల్‌ జంపింగ్‌ చేయడం నేరం అన్నారు. వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్స్, పొల్యూషన్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పని సరిగా ఉండాలన్నారు.   సీఎంవీ రూల్‌ 138(3) ప్రకారం విధిగా సీటు బెల్ట్‌ ధరించాల్సిందేనని, సీటు బెల్ట్‌ ధరించకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్‌ 194(బి) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. వాహనాలను పార్కింగ్ జోన్‌ల్లో మాత్రమే పార్క్ చేయాలన్నారు.  18 సంవత్సరాలు పూర్తికాని వారు వాహనాలను నడపకూడదన్నారు.                ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహా రెడ్డి, ఉపాధ్యాయులు మార్ల ఓబుల్ రెడ్డి, చింతం విజయసారథి రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులుతదితరులు  పాల్గొన్నారు.

About Author