ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో కర్నూల్లో తిరంగా యాత్ర
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పాకిస్తాన్ ఉగ్రమూకల పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఎన్డీఏ పక్షాలు చేపట్టిన తిరంగా యాత్ర లో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన యాత్రకు పరిశ్రమల శాఖ మాత్యులు,, శ్రీ టి.జి.భరత్ పాల్గొని ప్రారంభించారు. తిరంగా యాత్రకు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి , మాజీ రాజ్యసభ సభ్యులు టి. జి. వెంకటేష్, మాజీ మంత్రివర్యులు కే. ఇ. ప్రభాకర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి, బి.జే.పి జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సురేష్ లతో పాటు కూటమి పార్టీల నాయకులు, కర్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ కి , వీరోచితంగా పోరాడి విజయం సాధించిన భారత త్రివిధ దళాల సైనికులకు మద్దతుగా ఆత్మీయమైన సంఘీభావం తెలియజేస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీసు వరకు
“తిరంగా ర్యాలీ” ని నిర్వహించడమైనది.
కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు వై.నాగేశ్వరరావు యాదవ్, కె.వి.సుబ్బా రెడ్డి, నంద్యాల నాగేంద్ర, పద్మలతా రెడ్డి, పేరపోగు రాజు, నంది మధు, జేంస్, రామాంజనేయులు, పౌల్ రాజ్ మొదలగు వారు పాల్గొన్నారు.