PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కనీ వినీ ఎరుగని రీతిలో రోళ్లపాడు తిరుణాల

1 min read

-ఎద్దుల పోటీలను ప్రారంభించిన శాప్ చైర్మన్

-అశేష జనవాహిని నడుమ రథోత్సవం

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: శ్రీ బరక సంజీవరాయ స్వామి తిరుణాల కనీ వినీ ఎరుగని రీతిలో ఆలయ ధర్మకర్త పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో బరక సంజీవరాయ స్వామి 13వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటలకు దేవాలయంలో గణపతి పూజ చేశారు.9 గంటలకు రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ దేవాలయంలో వీరు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఎద్దుల పోటీలను సిద్ధార్థ రెడ్డి ప్రారంభించారు.రైతులను సిద్ధార్థ రెడ్డి,ధార సుధీర్ శాలువాలతో సన్మానించారు.   ముందుగా వీరికి ఆలయ ధర్మకర్త మురళీమోహన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ పే రెడ్డి వెంకటరామిరెడ్డి ఘన స్వాగతం పలికారు.అనంతరం సిద్ధార్థ రెడ్డి ఎద్దుల పోటీలను ప్రారంభించారు.సాయంత్రం 5:45 కు భారీ జన సందోహం నడుమ రథోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నుంచి ప్రజలు మహిళలు,చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు.  ఈ రథోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మిడుతూరు ఎస్ఐ ఎం.జగన్ మోహన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా శివ రామకృష్ణారెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,మల్లు శివ నాగిరెడ్డి, సర్పంచులు పని భూషణ్ రెడ్డి, నాగ స్వామి రెడ్డి,అలగనూరు చిన్న రామచంద్రారెడ్డి, రాముడు,రవి పుల్లయ్య రామలింగేశ్వర రెడ్డి,తువ్వా రామ నాగేశ్వరరెడ్డి,దాసి కృష్ణారెడ్డి,మల్లేశ్వర రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

About Author