ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read– ఏకాదశి సందర్భంగా శ్రీపతికి సహస్ర కమలార్చన సేవ
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని తిరుమల నగర్ లో వెలసిన శ్రీ వేంకటసాయి మందిరం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిశాయి. శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి సహస్ర కమలాలతో అలంకరించి, సహస్రనామార్చన చేశారు. తదనంతరం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ధార్మిక నిష్ట పెరగాలని, దానివలన సమాజంలో శాంతి సుస్థిరతలు నెలకొంటాయని అన్నారు. ఆలయ కమిటీ వ్యవస్థాపకులు యు.శ్రీనివాసులు భక్తులందరిచే సహస్రనామార్చన, గోపూజతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.వి.వరప్రసాద్, ప్రధానార్చకులు ఆర్.మల్లిఖార్జున, టి.విజయరావు, బి.వెంకటేష్ , వి.రాముడు, జె.శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ బి.భాస్కరరెడ్డి, యు.కె.శాంతి, జి.సంద్య, జి.శ్రీదేవి, యు.ఎం.సంద్య, జె.లక్ష్మీ, వి.జయలక్ష్మీ, భుజంగనాధ్ చంద్రకళ, జి.మంజుల, కె.హారతి, పి.జి.జ్యోతి, ఎం.గౌరమ్మ, వై.ప్రభాకర్, నాగేశ్వరరావు, వాణిశ్రీ, సుజాత, గణేశ్, తిమ్మప్పతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.