PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిమాండ్ల సాధనకు.. ఉద్యమం ఉధృతం..

1 min read

– సీపీఎస్​ రద్దు… పీఆర్​సీ అమలు చేయాల్సిందే…
– ఫ్యాప్టో కర్నూలు జిల్లా ఇన్​చార్జ్​ ప్రకాష్​ రావు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు ఫ్యాప్టో కర్నూలు జిల్లా ఇన్​చార్జ్​ కె. ప్రకాష్​ రావు. డిమాండ్ల సాధన కోసం శుక్రవారం కర్నూలు శ్రీ కృష్ణ దేవరాయ సర్కిల్​లో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు నుంచి దాదాపు 200 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని FAPTO రాష్ట్ర కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జి కె.ప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్​సీ ఇంత వరకు అమలు చేయలేదని, వారం రోజుల్లో సీపీఎస్​ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు రద్దు చేయాలని, పెండింగ్​లో ఉన్న కరువు భత్యం బకాయిలు 7 చెల్లించాలని డిమాండ్​ చేశారు. అనంతరం FAPTO రాష్ట్ర పరిశీలకులు శ్రీ హెచ్. తిమ్మన్న మాట్లాడుతూ 3,4 , 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడం వల్ల గ్రామీణ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.

యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్ ప్రసంగిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే మంజూరు చేయాలన్నారు. అప్టా రాష్ట్ర నాయకులు పి రాజసాగర్, ధర్నాకు మద్దతు గా జిల్లా ఎ పి. ఎన్ జి ఓ నాయకులు నాయకులు వెంగళ్ రెడ్డి , జవహర్ లాల్ గారి వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘ నాయకులు ధర్నా లో పాల్గొని ఉపన్యసించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కర్నూలు తహసీల్దార్​ వెంకటేష్​ నాయక్​కు అందజేశారు. FAPTO ధర్నాకు మద్దతు ప్రకటించిన పి ఈ టి అసోసియేషన్ నాయకులు లక్ష్మయ్య, పండిట్ అసోసియేషన్ నాగేంద్ర, రఘు, బి టి ఏ రాష్ట సహాయ అధ్యక్షుడు ఆనంద్, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయ సంఘం నాయకులు రాముడు, గోకారి యెస్ టి యూ, ఇస్మాయిల్ ఏ పి టి ఎఫ్,జయరాజు యు టి ఎఫ్, అల్లా బక్స్ డి టి ఎఫ్, మధుసూదన్ రెడ్డి ఆప్టా, నారాయణ హెడ్ మాస్టర్ అసోసియేషన్ నాయకులు,జిల్లా FAPTO చైర్మన్ సుధాకర్, జిల్లా సెక్రటరీ జెనెరల్ రంగన్న పాల్గొన్నారు.

About Author