NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోగ్యంగా ఉండాలంటే…. వ్యాయామం అవసరం

1 min read

కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్

పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  కర్నూలు నగర మేయర్ బివై రామయ్య

కర్నూలు నియోజకవర్గ అబ్జర్వర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ కార్యక్రమంలో కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్  పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  కర్నూల్ నగర మేయర్ బి వై రామయ్య  మాట్లాడుతూ వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల వారికి ఇది తోడ్పడుతుంది. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి కూడా దూరం చేస్తుంది. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.కండరాలు, కీళ్ళు కదలికలు సులభంగా జరిగేందుకు ఉపకరించే వ్యాయామం. వాయుసహిత వ్యాయామాలు: సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి. వాయురహిత వ్యాయామాలు: కసరత్తులు, బరువుతగ్గడానికి యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు.యువతకు ఖచ్చితంగా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ అబ్జర్వర్ కర్రా హర్షవర్ధన్ రెడ్డి , కర్నూలు జిల్లా, వైఎస్ఆర్ సేవాదళ్ అధ్యక్షులు కేదార్ నాథ్ , కో-ఆప్షన్ నెంబర్ శ్రీరాములు , అక్బర్ , జిమ్ ఓనర్ మధు , మేనేజర్ ఇర్ఫాన్ ,చెన్నమ్మ , సూర్య మోహన్ , చందు , ఫయాజ్, వసంత్ , ఆదిశేషు,నాగేంద్రుడు , వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author