NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలి : పోతిన మహేష్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: సమాజంలో అన్ని రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్న వాల్మీకి కులాన్ని ఎస్టీ రిజర్వేషన్ లో పునర్దించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. వాల్మీకి కుల సమస్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో చేర్చుతామని ముఖ్యమంత్రి చెప్పారని వైసీపీ ఇన్చార్జ్ పి.రామచంద్ర వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం – వాల్మీకి జేఏసీ అధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్ష గురువారంనాడు 12వ రోజుకు చేరుకుంది. వీరికి వైసిపి ఇన్చార్జ్ పి. రామచంద్ర, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోతిన వెంకట్ మహేష్ మాట్లాడుతూ వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని పోరాటం చేస్తున్నారని కానీ వారిని ధర్నా కూడా చేయకూడదని ఆంక్షలను ఈ ప్రభుత్వం పెట్టిందని తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా 13 జిల్లాలో గుర్తించాలని అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పూర్తి మద్దతు తెలిపారని, అందుచేత వాల్మీకులకు మద్దతుగా వచ్చామని చెప్పారు.వాల్మీకుల ను ఎస్టీలుగా గుర్తించే వరకు వాల్మీకుల పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని భరోసా ఇచ్చారు.వైసిపి ఇంచార్జ్ రామచంద్ర మాట్లాడుతూ వాల్మీకుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో ఆయన ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో చేర్చుతామని చెప్పారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తారని పేర్కొన్నారు.ఈ నిరసన ధీక్షలో కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన దీక్షలో కన్వీనర్ బి . ఈశ్వరయ్య , కో కన్వీనర్ ఈ హను మంతరావు , ఎం వెంకటేశ్వర్లు , బి . నాగమణి , సిహెచ్.భాను , తదితరులు పాల్గొన్నారు.

About Author