బంగారం కొనుగోలుకు.. హాల్ మార్క్ తప్పనిసరి
1 min read– మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎం.పీ.అహమ్మద్
పల్లెవెలుగు వెబ్: వినియోగదారుల హక్కులు సంరక్షించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను పకడ్బందీగా, ప్రణాళికబద్ధంగా అమలు చేస్తోందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ పేర్కొన్నారు. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు వందశాతం చట్టబద్ధంగా నిర్ధారించేందుకే ప్రభుత్వం హాల్మార్క్ తీసుకొచ్చిందని, ఈ చట్టం జూన్ 16 నుంచి అమలులోకి వచ్చిందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టంతో కొనుగోలుదారులు మోసపోయే అవకాశం లేకుండా.. భరోసా ఇస్తుందన్నారు. నాణ్యమైన బంగారం వస్తువులు లేదా బంగారు ఆభరణాలు విక్రయించడం లేదా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. బంగారు మన్నిక, నాణ్యత ప్రమాణాలు పాటించే బంగారు వ్యాపారులకు… అటు వినియోగదారులకు ఎంతో లాభం చేకూర్చుతుందన్నారు. స్వచ్ఛమైన బంగారం విక్రయించడం ద్వారా వినియోగదారుల నమ్మకం మరింత రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎం.పీ. అహమ్మద్ వెల్లడించారు.