PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే తెదేపాకు విజయాన్ని అందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందాలంటే తెదేపాకు విజయం అందించాలని డోన్  నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయ సుర్య ప్రకాశ్ రెడ్డి తనియురాలు కోట్ల చిత్రమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ప్యాపిలి  పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో కోట్ల చిత్రమ్మ  ,కోట్ల శ్రీనాథ్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ తోప్పల శ్రీనివాస్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా మూర్తి , చల్లా వీర  ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలో కోట్ల చిత్రమ్మ  ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తూ తన తండ్రి విజయం కోసం ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించాలని, అలాగే పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరిమ్మకు ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చల్లా అనుదీప్ , నాగేంద్ర , కృష్ణమోహన్ ,గుజ్జ బోయిని వెంకటేష్ , బాలకృష్ణ ,జనసేన మధు నాయుడు , జనసేన సునీల్ , జనసేన చంద్ర ,ప్రిన్సిపాల్ మధు ,కొంగనపల్లి మధు,చిన్న పొదిల్లా శివ , వెంగనాంపల్లి కోదండ రామయ్య , భాస్కర్ నాయుడు , అక్బర్ వలి మరియు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author