అతడికి.. వితంతువు పింఛన్
1 min read– వాలంటీర్ తొలగింపు.. వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో పురషుడికి వితంతువు పింఛన్ పంపిణీ విషయంలో కలెక్టర్ జి. వీరపాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వాలంటీర్‌ను తొలగించి.. వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.ఎద్దుపెంట గ్రామానికి చెందిన హరిజన కాశీం 2009 ఫిబ్రవరి నుంచి అప్పటి పంచాయతీ సెక్రటరి ద్వారా పించన్ మంజూరు చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వితంతువు పింఛన్ పొందుతూనే ఉన్నాడు. ఈనెల 8న ‘ అతడికి వితంతువు పింఛన్’ శీర్షికతో పల్లెవెలుగు వెబ్ మీడియాలో ప్రచురితమైన విషయం విధితమే. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన వైకేపీ డీఆర్డీఏ శ్రీనివాసులు.. వాలంటీర్ సువర్ణకు సదరు వ్యక్తి చిన్నాన్న కావడంతో, బంధుప్రీతితో పింఛన్ కొనసాగిస్తూ.. సిఫారస్ చేసినట్లు తేలింది. అంతేకాక ఎద్దుపెంట వెల్ఫేర్ అసిస్టెంట్ సుభాషిణి నిర్లక్ష్య ధోరణితో పరిశీలించకుండా పై అధికారులకు సిఫారసు చేసినట్లు స్పష్టమైంది. నివేదికను డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు కలెక్టర్‌కు సమర్పించిన వెంటనే..వాలంటీర్ సువర్ణను, వెల్ఫేర్ అసిస్టెంట్ సుభాషిణినిసస్పెండ్ చేస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.