PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రూస్ లీ 83వ జయంతి  సందర్భంగా నగరంలో టు కే రన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని స్థానిక టౌన్ మోడల్ పాఠశాల నందు బ్రూస్ లీ 83వ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యు ఆర్ బి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఊట్ల రమేష్ బాబు హాజరయ్యారు అనంతరం టూ కే రన్ ను ప్రారంభించారు టైక్వాండో విద్యార్థులను బ్రూస్ లీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి బ్రూస్ లీ కరాటే మార్షల్ ఆర్ట్స్ యోధుడు ఆయనను స్ఫూర్తి గా తీసుకుని కర్నూలు నగరంలో కిడ్స్ వరల్డ్ నందు సాధన చేసే విద్యార్థులు నగరానికి టైక్వాండో క్రీడలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలియజేశారు అనంతరం పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందజేశారు. టైక్వాండో మాస్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మా అకాడమీ తరుపున బ్రూస్ లీ జన్మదిన వేడుకలు గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది బ్రూస్ లీ యుద్ధకళ నైపుణ్యం కల వ్యక్తి ఆయన అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కరాటే యోధుడు మరియు నటుడు అని తెలియజేశారు.

About Author