కర్నూలుకు.. ‘నిమ్స్’ రావాలి..
1 min read– ఆదిశగా కృషి చేస్తా.. ఎంపీ డా. సంజీవ్‌కుమార్
– ఎంపీని సన్మానించిన మెడికల్ కళాశాల బృందం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు మెడికల్ కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ డా. సంజీవ్‌కుమార్. సూపర్ స్పెషాలిటీ విభాగంలో 5 కోర్సులలో 9 సీట్లు పెంపునకు విశేష కృషి చేసిన ఎంపీని మెడికల్ కళాశాల వైద్య బృందం అభినందన కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో పినాకపాణి హాల్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ డా. సంజీవ్ కుమార్ కళాశాల బృందం ఘనంగా సన్మానించారు.
సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఐదు కోర్సులలో 9 సీట్లు వచ్చాయని.. త్వరలో మిగిలిన 3 కోర్సులలో సీట్లు తీసుకొచ్చేందుకు మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. కర్నూలు మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదిశగా అడుగులు వేస్తే… నిమ్స్ లాంటి ఆస్పత్రి కర్నూలుకు వస్తుందన్నారు. అనంతరం కార్డియాలజీ వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు సూపర్ స్పెషాలిటీ సీట్లు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని, ఇందుకు కృషి చేసిన ఎంపీ డా. సంజీవ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తరువాత ఎంపీ డా. సంజీవ్ కుమార్‌ను వైద్యకళాశాల బృందం శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల వైద్య సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.