NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీల బాధ్య‌త గుర్తుచేసేందుకే.. : ప‌వన్ క‌ళ్యాణ్

1 min read
                                

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించొద్ద‌న్న వాద‌న ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌యత్నం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 18,19,20 తేదీల్లో డిజిట‌ల్ క్యాంపెయిన్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నా కూడ గ‌ళం విప్ప‌లేక‌పోయార‌ని, పైగా కేంద్రానిదే బాధ్య‌త అంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. వారి బాధ్య‌త గుర్తుచేసేందుకే డిజిట‌ల్ క్యాంపెయిన్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి మ‌ద్ద‌తుగా గ‌ళం విప్పాల‌ని డిమాండ్ చేశారు.

About Author