‘సీమ నవల’ కు .. డాక్టరేట్
1 min read– హసీనాకు డాక్టరేట్ ప్రకటించిన వై.వి.యు
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: యోగి వేమన విశ్వవిద్యాలయ తెలుగు శాఖ విభాగంలో పరిశోధక విద్యార్థిని దూదేకుల హసీనా కు వైవీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. తెలుగు శాఖ సహఆచార్యులు జి.పార్వతి పర్యవేక్షణలో “ దశాబ్ద కాలంలో రాయలసీమ నవలలు – ఒక అధ్యయనం (ఏ డెకెడ్ ఆఫ్ రాయలసీమ నావల్స్- ఎ స్టడీ (01 – 2010) ” అనే అంశం పైన పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని పరీక్షల విభాగానికి సమర్పించారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి మార్గదర్శకం మేరకు నియమితులైన నిపుణుల బృందం దూదేకుల హసీనా రూపొందించిన పరిశోధన గ్రంథం అధ్యయనం చేసి డాక్టరేట్ కు అర్హత సాధించినట్లు నిర్ణయించారు. ఈమెకు సంబంధించిన డాక్టరేట్ ప్రొసీడింగ్స్ ను వై. వి. యూ. పరీక్షల నిర్వహణాధికారి ఆచార్య పుత్తా పద్మ జారీ చేశారు. పరిశోధకురాలు హసీనా రాసిన పరిశోధన పత్రాలు పలు జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. పలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో కూడా పరిశోధన పత్రాలు సమర్పించారు. తెలుగు విభాగంలో డాక్టరేట్ అందుకున్న పరిశోధక విద్యార్థి హసీనా ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సూర్య కళావతి, కుల సచివులు ఆచార్య డి. విజయరాఘవ ప్రసాద్, ప్రధానాచార్యులు కె.కృష్ణారెడ్డి, ఉప ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డి, తెలుగు శాఖ అధిపతి డా.ఎన్.ఈశ్వరరెడ్డి, ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి, సహ ఆచార్యులు డాక్టర్ రమా దేవి,డాక్టర్ వినోదిని, పరిశోధకులు అభినందించారు.