ప్రజా సమస్యల పరిష్కారానికే గడపగడపకు : ఎమ్మెల్యే గంగుల
1 min readపల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి : ప్రజా సమస్యల పరిష్కారానికి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్ర మాన్ని గ్రామ,గ్రామానా నిర్వహిస్తున్నామని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండలం లోని పెద్ద బోధనం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్దిపోందిన వివరాలను తెలిపి సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా అయన ప్రజలతో మాట్లాడుతూ నవరత్నాల ద్యారా ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఒక వరం లాంటిదన్నారు. పేదలకు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు తమ ప్రభుత్వం నవరత్నాలద్యారానే సంక్షేమ పథకాలను అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మండల పార్టీ కన్వీనర్ జి కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు వీరభద్రుడు, ఎంపీటీసీ సభ్యులు వైసీపీ సీనియర్ నాయకులు పత్తి నారాయణ, నరసింహులు, సర్పంచులు ముడియం శివమ్మ , ప్రతాప్ రెడ్డి, గోవిందయ్య, బంగారు షరీఫ్, ,జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, తహసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈఓ అనురాధ, హౌసింగ్ డిఇ నాగరాజు,ఈవోఆర్డి నాగేంద్రయ్య , మండల పశువైద్యాధికారి సాయిబాబా, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ, ఏఈలు కొండారెడ్డి , ముల్లా షాజహాన్, షఫీ వుల్ల, ఏవో నేతాజీ, కార్యదర్శి సబియా, వీఆర్వో వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ ధోని రత్నాలమ్మ, నాయుడు, వెంకటరామిరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి , యామ బాలకృష్ణారెడ్డి , యామ ఓబుల్ రెడ్డి, నరేష్ సింహ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబు, రాంపల్లి రామకృష్ణ, తోపుల నరసింహ, బ్రాహ్మణ పల్లె శ్రీనివాసరెడ్డి, శివ, సంజీవ, ముల్లా ఖాదర్బాషా, అబ్దుల్లా, బబ్లు తదితరులు పాల్గొన్నారు.