PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీ ‘స్పందన’కు… 112 ఫిర్యాదులు

1 min read

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… ఎస్పీ  సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్

పల్లెవెలుగు వెబ్​ : ‘ స్పందన’ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదును విచారణ జరిపి.. చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి. సోమవారం  కర్నూలు నగరంలోని  కొత్తపేట దగ్గర ఉన్న స్పందన కార్యాలయంలో  స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి  మొత్తం 112  ఫిర్యాదులు వచ్చాయి.  స్పందనకు వచ్చిన  ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడారు. వారి యొక్క సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.   అందులో కొన్ని ….

1)         నా కుమారుడికి పశువైద్యశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 3 లక్షల 50 వేలు తీసుకొని మోసం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఆదోని పట్టణానికి చెందిన లక్ష్మన్న  ఫిర్యాదు చేశారు.

2)         ఐసిడిఎస్ లో సూపర్ వైజర్ పోస్టు ఇప్పిస్తామని లక్ష రూపాయలు తీసుకోని మోసం చేసిన వారిపై  చర్యలు తీసుకోవాలని కర్నూలు , అరోరా నగర్ చెందిన శ్రీనివాసులు  ఫిర్యాదు చేశారు.

3)         ఎస్ బి ఐ ఫేక్ లింక్ ద్వారా నా యొక్క బ్యాంకు ఖాతా లోని డబ్బులను తస్కరించిన సైబర్ నేరగాళ్ళ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, నాగిరెడ్డి రెవిన్యూ కాలనికి చెందిన మనోహార్  ఫిర్యాదు చేశారు.

4)         నా పొలంలో వేసిన పత్తి పంటను నాశనం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పెద్దకడబూరు గ్రామానికి చెందిన అమ్మద్ భాష్ ఫిర్యాదు చేశారు. 

5)         అడ్డుగా ఇంటిని నిర్మిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎద్దుల బండి రస్తా ఇప్పించాలని  కల్లూరు మండలం, కె. మార్కాపురం గ్రామానికి చెందిన ఎర్రన్న ఫిర్యాదు చేశారు. 

6)         నా పొలంలోకి వెళ్ళనివ్వకుండా,  పంట వేయనియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని డోన్ , కొండపేటకు చెందిన షేక్ గౌసియా బేగం ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ గారు హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో  డిఎస్పీలు యుగంధర్ బాబు,  వెంకటాద్రి  ఉన్నారు.

About Author