NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల‌కు.. కేటీఆర్ కౌంట‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు వ్యాఖ్య‌ల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. రూ. 50కే చీప్ లిక్క‌ర్ అందిస్తామ‌న్న సోమువీర్రాజు వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు. ` వావ్ వాట్ ఏ స్కీం, వాట్ ఏ షేమ్. రూ. 50కే చీప్ లిక్క‌ర్ బీజేపీ జాతీయ విధానమా ?. అధికారం కోసం బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్నారా ? అని ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ జ‌నాగ్ర‌హ స‌భ‌లో సోము వీర్రాజు వైసీపీ ప్ర‌భుత్వం పై మండిప‌డ్డారు. మ‌ద్య నిషేధం చేస్తామ‌ని చెప్పి చీప్ లిక్క‌ర్ త‌యారు చేసి అమ్ముతున్నార‌ని ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌స్తే రూ. 70 కే చీప్ లిక్క‌ర్ ఇస్తామ‌ని, రాబ‌డి బాగుంటే రూ. 50కే చీప్ లిక్క‌ర్ అమ్ముతామ‌ని అన్నారు.

                                       

About Author