రష్యా దెబ్బకు.. భారీగా పెరిగిన బంగారం
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ప్రపంచ వ్యాప్తంగా భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సంక్షోభంలో సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా భావించే బంగారం ధర ఎగబాకుతోంది. బంగారం ధరలు ఒక్క రోజు వ్యవధిలోనే 30 శాతం పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ. 850 పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకి రూ. 930లు పెరిగింది. 2022 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల సమయంలో ఆభరణాల తయారీలో ఉపయోగించే బంగారం తులం ధర రూ. 46,850 దగ్గర ట్రేడవుతుండగా స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.51,100లుగా ఉంది.