PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేయర్​కు.. అభినందన

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలును గ్రీన్​ సిటీగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్న నగర మేయర్​ బీవై రామయ్యకు హార్ట్​ ఫౌండేషన్​ సెక్రటరి, ప్రముఖ వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్​ అభినందనలు తెలిపారు. కర్నూలు హార్ట్​ఫౌండేషన్​ సభ్యులు ఆదివారం సాయంత్రం నగర మేయర్​ బీవై రామయ్య స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సెక్రటరి, ప్రముఖ వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ నగర మేయర్​గా బీవై రామయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి.. కర్నూలును రాష్ట్రంలోనే ఆదర్శనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని.. పరిష్కరిస్తున్నారని పేర్కొన్న డా. చంద్రశేఖర్​.. మేయర్​ బీవై రామయ్య భవిష్యత్​లో తీసుకునే నగర అభివృద్ధి నిర్ణయాలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు ఉన్నారు.

About Author