NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ జెండాకు.. వందనం…

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలే స్పూర్తిగా దేశ అభివృద్ధికి కృషి చేద్దాం దేశభక్తిని వ్యక్త పరుస్తూ ఆదివారం మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ఎస్ శ్రీధర్, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ నాగమణి, ఎంపీడీవో కార్యాలయంలో విజయసింహారెడ్డి , ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి సృజన జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్య సాధనకై అవిశ్రాంత పోరాటం చేసిన సమరయోధులు, ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులందరికీ పాదాభివందనాలంటు. వారి త్యాగాలే స్పూర్తిగా, వారి పోరాటాలే ఆదర్శంగా భారతదేశ అభివృద్దికి అందరం కృషి చేయాలని ప్రతినబూనారు. తహసిల్దార్ నాగమణి మాట్లాడుతూ 1947వ సంవత్సరం ఆగస్టు 15 న మన దేశం బానిసత్వం నుండి విముక్తిని పొందిందన్నారు. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతి ఫలాలని. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు.


About Author