PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ సైనికుడికి.. భార‌త్ ప‌ద్మశ్రీ ఇచ్చింది !

1 min read

పల్లెవెలుగు వెబ్: ఖాజీ స‌జ్జద్ అలీ జ‌హీర్. 1970ల్లో పాకిస్తాన్ సైనికుడు. పై స్థాయి అధికారులు కింది స్థాయి సైనికుల్ని హీనంగా చూడ‌టం ఆయ‌న‌కు న‌చ్చలేదు. స్వదేశీయుల‌పైనే అత్యాచారాలు, లూఠీలు చేయ‌డం ఆయ‌న‌కు రుచించ‌లేదు. దీనికి విరుగుడు భార‌త సైన్యంతో క‌లిసి పాకిస్థాన్ పై పోరాడ‌ట‌మే అని నిశ్చయించుకున్నాడు. సియాల్ కోట్ వ‌ద్ద అతికష్టం మీద భార‌త సైనికుల్ని చేరుకున్నాడు. భార‌త అధికారులు మొద‌ట్లో అత‌న్ని న‌మ్మలేదు. పాక్ గూఢ‌చారిగా అనుమానించారు. కానీ అత‌ను చెప్పిన మాట‌లు, అత‌ని వ‌ద్ద ఉన్న ఆధారాల‌తో అత‌న్ని న‌మ్మారు. పాక్ సైన్యం కీల‌క స్థావ‌రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో భార‌త అధికారుల‌కు చెప్పాడు. ఈ ఘ‌ట‌న బంగ్లాదేశ్ లిబ‌రేష‌న్ వార్ కు ముందు జ‌రిగిన‌ది. ఆ యుద్ధంలో ఆయ‌న ఎంతో స‌హ‌క‌రించారు. ఇప్పటికీ ఆయ‌న కోసం పాకిస్థాన్ లో మ‌ర‌ణ శిక్ష ఉత్తర్వులు ఎదురుచూస్తున్నాయి. పాక్ న్యాయ‌స్థానం ఆయ‌న‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయ‌న బంగ్లాదేశ్ లో నివాసం ఉంటుండ‌టంతో పాక్ ఆయ‌న్ని ఏమీ చేయ‌లేక‌పోతోంది. ఆయ‌న చేసిన సాయానికి గుర్తుగా భార‌త్ ప్రభుత్వం ప‌ద్మశ్రీ బిరుదుతో స‌త్కరించింది. భార‌త ప్రభుత్వం, ప్రజ‌లు త‌న‌ను మ‌రిచిపోలేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

About Author