కర్నూలు ప్రజలకు.. విజయ దశమి శుభాకాంక్షలు
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు:కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంజీవ్ కుమార్. విజయా లకు కారకమైన దశమి విజయదశమన్నారు. ఈ దసరా పండగును ఇంటిల్లిపాది “సుఖ,సంతోషాలతో” జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకున్నారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని అభిలాషించారు.