NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరంతర సేవకుడికి.. ఘనసన్మానం

1 min read

– కలెక్టర్​ను సన్మానించిన మేయర్​ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య కలెక్టర్​ జి. వీరపాండియన్​ను ఘనంగా సన్మానించారు. మంగళవారం కలెక్టరేట్​లోని వీసీ ఛాంబరులో కలెక్టర్​కు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్​ బీవై రామయ్య మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం కలెక్టర్ నిరంతర శ్రామికుడులా పనిచేశారని, జిల్లా యంత్రాంగానికి సమర్ధవంతంగా, సరైన దిశానిర్దేశం చేస్తూ అధికారులను ముందుకు నడిపించడంలో విజయవంతం అయ్యారని ప్రశంసించారు. మొదటి విడత కోవిడ్ సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో కేసులు వచ్చినప్పటికీ పక్కా ప్రణాళికతో అనతికాలంలోనే కేసులు తగ్గించగలిగారన్నారు. రెండో విడతలో కూడా ప్రమాద తీవ్రతను గుర్తించి ముందస్తు ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జి.సుధాకర్ ఉన్నారు.

About Author